Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 90 వేల మంది రైతుల నుంచి రూ.10,500 కోట్ల విలువ చేసే 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో 50.26 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని మిల్లులకు తరలించామనీ, వీటి కోసం 13 లక్షల గన్నీ బ్యాగులను ఉఫయోగించామని చెప్పారు. మరో ఎనిమిది లక్షల బ్యాగులు అందుభాటులో ఉన్నాయన్నారు. సేకరించిన ధాన్యానికిగాను రైతులకు రూ.8,576 కోట్లను చెల్లించామన్నారు. గతేడాది కన్నా డిమాండ్ అధికంగా ఉండటంతో ప్రయివేటు వ్యాపారులు సైతం కనీస మద్ధతు ధరను చెల్లించి కొనుగోలు చేశారనీ, ప్రభుత్వం గతేడాది కన్నా అధికంగా సేకరించిందని తెలిపారు.