Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇతర సమస్యలు పరిష్కరించాలి
- కుటుంబ సంక్షేమ కమిషనర్‌కు టీయూఎంహెచ్‌ఈయూ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రాక్ట్ ఎంపీహెచ్ఏ, ఏఎన్ఎంల పని భారం తగ్గించాలనీ, ఇతర సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ( టీయూఎంహెచ్‌ఈయూ ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్, రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్, రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఫసియోద్దీన్, రాష్ట్ర కోశాధికారి ఎ.కవిత నేతృత్వంలో నాయకులు కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేతామహంతికి వినతిపత్రం సమర్పించారు. ప్రతి కార్యక్రమానికి రిజిస్టర్ చొప్పున 32 రిజిస్టర్లను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో నిర్వహించడం పెనుభారంగా మారిందని తెలిపారు. ప్రతి ప్రాథమిక కేంద్రంలో ఆన్లైన్ నమోదుల బాధ్యతను డేటా ఎంట్రీ ఆపరేటర్లకు అప్పగించి ఏఎన్ఎంలను తప్పించాలని కోరారు. రాత్రి వేళల్లో ఉద్యోగులు, సూపర్ వైజర్లు రిపోర్టుల కోసం ఇబ్బంది పెట్టకుండా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న ఎంపీహెచ్ఏ (ఎఫ్)ల సేవలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.అర్హులైన ఏఎన్ఎంలకు పదోన్నతులు కల్పించాలనీ, నిలిచిపోయిన అదనపు ఇంటి భత్యం పునరుద్ధరించాలనీ, ఆరోగ్య ఉప కేంద్రాల భవనాల అద్దె బకాయిలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వీటి నిర్వహణ కోసం ఏడాదికి రూ.50 వేలు విడుదల చేయాలని కోరారు. ప్రతి నెలా వ్యాక్సిన్ కిట్ అలవెన్సులు చెల్లించాలనీ, క్షేత్ర సిబ్బందిని పల్లె, బస్తీ దవాఖానాల నిర్వహణ బాధ్యతను అప్పగించడం సరికాదని పేర్కొన్నారు. కమిషనర్‌ను కలిసిన వారిలో యూనియన్ రాష్ట్ర నాయకులు అన్నాంబిక, సుజన, సరోజ, నర్మదా, అరుణ, జమున రాణి, వేణుగోపాల్, పుష్పలత, సుగుణ, పద్మ, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.