Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో శుక్రవారం ఒక సైకో హల్చల్ చేశాడు. అడ్డు వచ్చిన వారిపై కారణం లేకుండా ఇనుపరాడ్, తాపీ, రాళ్లతో దాడి చేయడం మొదలు పెట్టాడు. దాదాపు పది మందికి గాయాలు కావడంతో చేసేదిమీ లేక, స్థానికులు ఆ సైకోను తాళ్లతో చేతులు, కాళ్లు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఎక్కడ నుంచి వచ్చావని వివరాలు అడగగా.. కలకత్తా నుంచి వచ్చినట్టు హిందీలో సమాధానం ఇచ్చినట్టు తెలిపారు.
ఈ ఘటనతో వెంకటేశ్వర కాలనీ ప్రజలు భయంతో ఇండ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్న పరిస్థితి ఏర్పడింది. పోలీసు వివరాల ప్రకారం.. బతుకు దెరువు కోసం కొల్కత నుంచి వచ్చిన సమన్ అనే వ్యక్తి దినసరి కూలీగా పనిచేస్తూ, జీవనం సాగిస్తున్నాడని, శుక్రవారం ఉదయం నుంచి మద్యం తాగడంతో మత్తులో సైకోలా ప్రవర్తించినట్టు ప్రాథమిక విచారణలో తెలినట్టు పోలీసులు తెలుపుతున్నారు. వైద్య పరీక్షల అనంతరం పూర్తిస్థాయిలో నిర్థారణకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.