Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్లో బస
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దక్షిణాది పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో జరిపే ఐదు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ము రామప్ప, భద్రాచలాన్ని సందర్శిస్తారు. అలాగే హైదరాబాద్ నగరంలో స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రంగారెడ్డి జిల్లా కన్హాశాంతి వనంలో శ్రీ రామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు రామచంద్ర మహారాజ్ 150 జయంతి ఉత్సవాలను ప్రారంభిస్తారు. దీనికి గుర్తుగా హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్ ప్రచార ఫలకం ఆవిష్కరణలో కూడా ఆమె పాల్గొంటా రు.రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి విడిది కోసం చేయాల్సిన ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేయాలనీ, ఈ మేరకు అధికారులు సమన్వయంతో పని చేయాలని పలు శాఖల అధికారులను ఆదేశించారు.