Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధుల లెక్క తేల్చండి
- అధికారులతో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి సమీక్ష
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆసరా పెన్షన్లకు ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని మంత్రులు టీ హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకరరావు అధికారులను ఆదేశించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అభయ హస్తం, వడ్డీ లేని రుణాలు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన వంటి వివిధ పథకాల కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధుల లెక్క తేల్చాలనీ, వాటిని రాబట్టడం కోసం ఆయా శాఖల స్థాయిలో అధికారులు కృషి చేయాలని చెప్పారు. ఆయా పథకాల కింద రాష్ట్రానికి రావల్సిన నిధులపై శుక్రవారం మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులపై ఢిల్లీలో ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇటీవల మంజూరు చేసిన ఫ్లడ్ డ్యామేజి, మెయింటెనెన్స్ నిధులు రూ.1867 కోట్ల పనుల పురోగతిపైనా వారు చర్చించారు. గ్రామపంచాయతీలకు రావలసిన పెండింగ్ బిల్లులు, రాబోయే రెండు ఆర్ధిక త్రైమాసికాలకు సంబంధించిన నిధులపై పర్యవేక్షణకు ఆదేశాలిచ్చారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకష్ణారావు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివద్ధి శాఖల కార్యదర్శి సందీప్ సుల్తానియా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.