Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ బ్యూరో
ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్ధులకు అరుదైన గౌరవం లభించింది. మహాసభల చివరి రోజు శుక్రవారం ఠాగూర్ ఆడిటోరియంలో ప్రధాన వేదికపై అఖిల భారత ఎస్ఎఫ్ఐ నాయకులు వారిని సన్మానించారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేటకు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్ధిని (16) హారిక మహాసభలకు డెలిగేట్‌గా హాజరయింది. మొత్తం 697 మంది డెలిగేట్లలో హారిక పిన్న వయస్కురాలు. చిన్న వయస్సులోనే మహాసభలకు హాజరై ఇతర విద్యార్ధులకు స్ఫూర్తిగా నిలిచిందని మహాసభను హారికను గౌరవించింది. ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్ దీప్సితా ధర్ హారికకు పుస్తకం అందజేసి అభివాదం చేశారు. విద్యారంగాన్ని నిర్వీర్యంచేసే ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా విద్యార్ధి ఉద్యమంలో పాల్గొని 38 రోజులు జైలులో గడిపిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్ధి సూరిబాబును మహాసభ గౌరవించింది.