Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శతజయంతి సందర్భంగా తెలంగాణ సాహితి నివాళి
- నేటి తరానికి కవిత్వం ఒక ప్రేరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'పాతకాలం పద్యమైతే /వర్తమానం వచన గేయం' అంటూ 'నాలో నినాదాలు'లో కుందుర్తి స్పష్టంగా ప్రకటించారని తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అన్నారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఎంహెచ్ భవన్లో ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తి అధ్యక్షతన కుందుర్తి శత జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందాచారి మాట్లాడుతూ శ్రీశ్రీ ద్వారా ప్రేరణ పొందిన కుందుర్తి వచన కవితకు ప్రాణం పోశారనీ, అందుకే ఆయనను తెలుగు సమాజం వచన కవితా పితామహుడిగా కీర్తిస్తుందని తెలిపారు. నేటి తరానికి కుందుర్తి ప్రేరణ అని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట కాలాన్ని తెలంగాణ కావ్యంలో ఆయన నిక్షిప్తం చేశారని గుర్తుచేశారు. కుందుర్తి యువ కవులను ప్రోత్సహించారని తెలిపారు. తంగిరాల చక్రవర్తి మాట్లాడుతూ కుందుర్తి నగరంలో వాన, నయాగరా కవిగా పేరు పొందారని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ సాహితి నాయకులు రాంపల్లి రమేశ్, అనంతోజు మోహన్ కృష్ణ , సలీమ, కె.శాంతారావు, అనుముల ప్రభాకరాచారి, పేర్ల రాము, అజరు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కుందుర్తి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.