Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేకప్రతినిధి-హైదరాబాద్
హైదరాబాద్‌లో 20 ఏండ్ల క్రితానికి, ఇప్పటికీ పోల్చుకుంటే ఊహకందని మార్పు ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్ర బాబునాయుడు అన్నారు. ఐటీ, బయోటెక్ రంగాల్లో హైదరాబాద్ ఎంతో ప్రగతి సాధించిందని గుర్తు చేశారు. ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐఎస్బీ) ద్విదశాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా హైదరాబాద్ ఐఎస్బీ విషయంలో చేసిన కృషిని ఆయన వివరించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి కోసం ఎలా కష్టపడ్డారో తెలియ జేశారు. విజన్ 2020 అన్నప్పుడు కొందరు 420 అని ఎగతాళి చేశారనీ, నేడు ఆ కళ సాకారమైందని అభిప్రాయపడ్డారు. విజన్ 2020తో ప్రారంభిం చిన వ్యవస్థలు ఇప్పుడు ఉజ్వలంగా ఉన్నాయని చెప్పారు. 20 ఏండ్ల క్రితం ఇక్కడ సెంట్రల్ వర్సిటీ ఒక్కటే ఉండేది..అమెరికా వెళ్లి అనేక మంది అగ్రశ్రేణి ఐటీ కంపెనీల సీఈవోలను కలిశాం.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను 10 నిమిషాలు సమయం ఇవ్వాలని బతిమాలుకున్నాం..10 నిమిషాలు అపాయింట్ మెంటు కోరి 45 నిమిషాలపాటు ఆయనకు ఆయనకు వివరిం చాం.. భారతీయులు గణితంలో స్వతహాగా ప్రతిభావంతు లు. గణితం, ఇంగ్లీష్ కలిస్తే ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ..ఇదే విషయం బిల్‌గేట్స్ చెప్పా..ఒక్క మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే దానివెనుక అనేక సంస్థలు వస్తాయని అప్పటి ఆలోచన. చైన్న్తె ముంబయి.. బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి వచ్చాకే హైదరాబాధ్ను ఎంపిక చేసుకున్నారని చెప్పారు. చాలా శ్రమించా కే హైదరాబాద్‌లో ఐఎస్బీ పెట్టాలన్న కల సాకారమైందనీ, పారిశ్రామికవేత్త లను సంతృప్తి పరిచి ఐఎస్బీని ఇక్కడికి తెచ్చాం. మైక్రోసాఫ్ట్ వచ్చాకే హైద రాబాద్‌లో ఐటీ విప్లవం ఊపందుకుందనీ, పైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లో జాతీ య, అంతర్జాతీయ సంస్థలు నెలకొన్నాయని వివరించారు.