Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 83 మందితో కేంద్ర కమిటీ ఎన్నిక
- 19 మందితో కేంద్ర కార్యదర్శివర్గం
- ఉపాధ్యక్షులుగా టి నాగరాజు
- తెలంగాణ నుంచి సీఈసీలోకి నలుగురు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వీపీ సానూ, మయూక్ బిశ్వాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో మహాసభల చివరి రోజైన శుక్రవారం కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శితోపాటు 19 మంది కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మొత్తం 83 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా నితిష్ నారాయణన్, ప్రతీకూర్ రహమాన్, టి నాగరాజు, అశోక్, సంగితాదాస్, అనుశ్రీ కే, సహాయ కార్యదర్శులుగా దినిత్ డెంటా, దిప్సితా థర్, శ్రీజన్ భట్టాచార్య, పీఎం అర్షో, సందిపన్ దేవ్, ఆదర్శ్ ఎన్నికయ్యారు. కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులుగా నిరుపన్, సుభాష్జక్కర్, అమిత్ ఠాగూర్, ఐషీ ఘోష్‌లను ప్రతినిధులు ఎన్నుకున్నారు. తెలంగాణ నుంచి కేంద్ర కమిటీ సభ్యులుగా ఆర్ఎల్ మూర్తి, ఎం పూజ, మమత, కే శివదుర్గారావు (హెచ్‌సీయూ), ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రసన్నకుమార్, నాగూర్ బి, పావనిలను మహాసభ ఎన్నుకుంది.