Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 77 మందితో సీకేసీ21 మందితో ఆఫీస్ బేరర్లుొ149 మందితో ఏఐకేసీ
ప్రత్యేక ప్రతినిధి- కె వరదరాజన్ నగర్ (త్రిసూర్)
అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా అశోక్ ధావలే, విజూ కృష్ణన్ ఎన్నికయ్యారు. మహాసభ చివరి రోజు శుక్రవారం ఆలిండియా కిసాన్ కౌన్సిల్ (ఏఐకేసీ), సెంటర్ కిసాన్ కౌన్సిల్ (సీకేసీ), ఆఫీస్ బేరర్ల ఎన్నిక జరిగింది. తొలుత అధ్యక్షుని ఎన్నిక జరిగింది. అనంతరం 149 మందితో ఏఐకేసీ, 77 మందితో సీకేసీ, 21 మంది ఆఫీస్ బేరర్లను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి సికెసి సభ్యులుగా ప్రభాకర్‌రెడ్డి, వి కృష్ణయ్య, ఏఐకేసీ సభ్యులుగా ఎం సూర్యనారాయణ, ఎం హరిబాబు (కౌలు రైతుల సంఘం) ఎన్నికయ్యారు. అంతకుముందు కార్యదర్శి నివేదికపై నాలుగు రోజులుగా ప్రతినిధుల చర్చల్లో వెల్లడైన అభిప్రాయాలు, సందేహాలపై ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా సమాధానం చెప్పారు. అనంతరం కార్యదర్శి నివేదికను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం అర్హతల కమిటీ వివరాలను పవిత్రోకార్, ఆర్థిక వివరాలను పి కృష్ణ ప్రసాద్ మహాసభ ముందుంచారు. మహాసభలో ఈ నాలుగు రోజుల్లో మొత్తం 16 తీర్మానాలు ప్రతిపాదించగా, కొన్నింటిని ఆమోదించారు. మిగతా తీర్మానాలకు తుది రూపం ఇచ్చేందుకు నూతన ఆఫీస్ బేరర్ల కమిటీకి అధికారం ఇస్తూ మహాసభ తీర్మానించింది. పంటలవారీగా అనుబంధ ఫెడరేషన్ల ఏర్పాటుకు సంబంధించి ఏఐకేఎస్ నిబంధనావళి (కనిస్టిట్యూషన్)కి సవరణలను మహాసభ ముందుంచి ఆమోదం తీసుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన విజూ కృష్ణన్ ప్రసంగిస్తూ రాబోయే రోజుల్లో బహుళ పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఏప్రిల్ 5న కార్మికులు, కర్షకులతో నిర్వహించ తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌లో పది లక్షల మంది పాల్గొనాలని కోరారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆధ్వర్యంలో జరిగే పోరాటాల్లో ముందు పీఠిన నిలిచి జయప్రదం చేయాలన్నారు. అధ్యక్షులు అశోక్ ధావలే మహాసభ ముగింపు ఉపన్యాసం చేస్తూ త్వరలో రాజస్థాన్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అసెంబ్లీ, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, మతతత్వ, మనువాద బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. హన్నన్‌మొల్లా మాట్లాడుతూ ఢిల్లీ రైతాంగ పోరాట స్ఫూర్తితో మోడీ ప్రభుత్వంలో దడ పుట్టించాలని చెప్పారు.
ఏఐకేఎస్ జాతీయ సహాయ కార్యదర్శిగా టి సాగర్
అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 35వ జాతీయ మహాసభల్లో సహాయ కార్యదర్శిగా టి సాగర్ ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా పోతినేని సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యులుగా పి జంగారెడ్డి, కున్రెడ్డి నాగిరెడ్డి, బొంతు రాంబాబు, కందాల ప్రమీలను మహాసభ ఎన్నుకుంది.