Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామాన్యులపై భారం : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పెట్రోల్ ధరలను తగ్గించని కేంద్ర ప్రభుత్వం... కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన విండ్ ఫాల్ ట్యాక్స్‌ను సైతం తగ్గించటం అత్యంత దారుణమని రాష్ట్ర మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇది ఆయా కంపెనీలకు వరమైతే.. సామాన్యులకు మాత్రం పెనుభారంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేనా బీజేపీ ప్రభుత్వ విధానమంటూ ఆయన ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా నుంచి తక్కువ రేటుకు ముడి చమురును మనం కొనుగోలు చేసినా విండ్ ఫాల్ ట్యాక్స్‌ను తగ్గించటం వల్ల ప్రజలకు పైసా మందం కూడా ప్రయోజనం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రూ.35 వేల కోట్ల పొదుపంతా ఒకట్రెండు కంపెనీలకే దక్కిందని వాపోయారు. ఆ యా సంస్థల లాభాలు ఎవరి జేబుల్లోకి పోతున్నాయంటూ ప్రశ్నించారు. కం పెనీల లాభాలపై పన్నును తగ్గించిన కేంద్రం... తన ప్రజా వ్యతిరేక నైజాన్ని మరోసారి చాటుకుందంటూ విమర్శించారు. మోడీ 'తన మిత్రులకు' లాభం చేకూర్చేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.