Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ నేతల్లో నివురు కప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి జ్వాల గుప్పుమంది. తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీల ప్రకటన రగిల్చిన చిచ్చు తారస్థాయికి చేరింది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు బహిరంగంగానే తమ అసంతప్తిని వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా అగ్నిరాజుకుంది. ఆయనపై సీనియర్లు తిరుగుబాటు జెండా ఎత్తారు. ఇటీవల ఏఐసీసీ ప్రకటించిన నూతన కార్యవర్గం, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షుల నియామకంలో ఒరిజనల్ కాంగ్రెస్ నాయకు లకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ గగ్గొలు పెట్టారు. పార్టీలో వలసవాదుల పెత్తనం పెరిగి పోయిందంటూ పరోక్షంగా రేవంత్‌రెడ్డిపై విమర్శల బాణం ఎక్కుపెట్టారు. శనివారం హైదరాబాద్‌లోని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో పార్టీ సీనియర్ నేతలు ఎంపీ ఎన్ ఉత్తమ్‌కుమార్, దామోదర రాజ నర్సింహ్మ, జగ్గారెడ్డి, మధుయాష్కీగౌడ్, మహే శ్వర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, సంజీవరెడ్డితో పాటు మరికొంత మంది నాయకులు సమావేశమయ్యారు. వలస వచ్చిన నాయకుల కు పార్టీ పదవుల్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారనీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి పెద్దపీట వేశారని ఆరోపించారు. పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా సీనియర్ల సమావేశానికి మద్దతు తెలపడంలో అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కాయి.
'పార్టీపై, కార్యకర్తలపై రేవంత్‌రెడ్డికి పూర్తి అవగాహన లేదు. ఆయన అవగాహనా రాహిత్యమే ఇందుకు ప్రధాన కారణం. క్యాడర్‌కు అందుబాటులో ఉండరు. కలవరు. మాట్లాడరు. బౌన్సర్ల నీడలో ఉంటారు. రోగాన్ని నిర్ధారణ చేయకుండా డాక్టర్ చికిత్స చేయలేడు. పార్టీ గురించి అవగాహన లేకుండా పార్టీని ముందుకు తీసుకపోవడం సాధ్యం కాదు. కౌంటర్ మెకానిజం లేదు. జిల్లాల్లో ఏం జరుగుతుందో తెలియదు. కేవలం దూకుడుగా వ్యవహరిం చడం ద్వారానే పార్టీ ముందుకు పోయే అవకాశం లేదు' అంటూ పేరు చెప్పడానికి ఇష్టపడని నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ కమిటీల ప్రకటనపై సీనియర్ నేతలు అసంతప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తూ కాంగ్రెస్‌ను కాపాడుతున్న తమకు అన్యాయం చేసి.. వలస వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని ఆరోపిం చారు. కాంగ్రెస్‌ను కాపాడుతున్న తమపై కోవర్టులు అంటూ సోషల్ మీడియాలో ముద్ర వేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై ఏఐసీసీకి నివేదిస్తామని వెల్లడించారు.
కమిటీల కూర్పులో కుట్ర : భట్టి
కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాలుగా ఉన్న నాయకులపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారనీ, దీని వెనుక ఏదో కుట్ర జరుగు తోందనే భావన కలుగుతున్నదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. పీసీసీ కమిటీల కూర్పులో తాను పాలుపంచుకోలేదని స్పష్టం చేశారు. అందుకే తనను కలిసేవారికి న్యాయం చేయలేకపోతున్నట్టు చెప్పారు. ఈ విషయంలో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నా ననీ, కాంగ్రెస్ పార్టీని రక్షించుకునేందుకు చొరవ చూపాల్సి ఉందన్నారు.
ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు : ఉత్తమ్
''నేను చాలాకాలం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు' అని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశా రు. 'సేవ్ కాంగ్రెస్' నినాదంతో ముందుకెళ్లా లని నిర్ణయించుకున్నామని తెలిపారు. జిల్లా అధ్యక్షుల నియామకంలో కాంగ్రెస్ గెలిచే ప్రాంతాల్లో ఏకాభిప్రాయం రాలేదన్నారు. 33 జిల్లాల్లో 26 చోట్ల నియమించి ఏడు చోట్ల ఆపడం సరికాదన్నారు. కమిటీల్లో ఎక్కువగా బయట నుంచి వచ్చిన వారికే స్థానం కల్పిం చారని వివరించారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతల కు అన్యాయం జరిగిందనీ, ఈ విషయం పై త్వరలోనే అధిష్ఠానానికి తెలియ జేస్తామన్నారు.
ఇక్కడే ఉంటాం.. ఇక్కడే చస్తాం: దామోదర రాజనర్సింహ
'మేం నాలుగు పార్టీలు మారి వచ్చిన వాళ్లం కాదు. ఇక్కడే ఉంటాం...ఇక్కడే చస్తాం' అంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే కమిటీల్లో ఎక్కువగా అవకాశం కల్పించారని చెప్పారు. మొదటి నుంచి ఉన్నవారిని కాపాడుకోవాలనేదే తమ ఆవేదన అని చెప్పారు.
అధికార పార్టీతో వ్యాపారం చేస్తూ...తమకు నీతులా? : మధుయాష్కీ
అధికార పార్టీతో వ్యాపారం చేస్తూ తమకు నీతులు చెప్పడమేంటని మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఉన్న నేతలంతా సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్నవాళ్లేననిన్నారు. కమిటీల విషయం లో పీసీసీ అధ్యక్షుడితో సమానంగా ఉండే సీఎల్పీ నేతనే భాగస్వామ్యం చేయడం లేదనీ, ఆయనకే అన్యాయం జరుగుతున్నదని చెప్పారు.
మేమూ కోవర్టులమా? : ఎమ్మెల్యే జగ్గారెడ్డి
రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కోసం అందరం పని చేశామన్నారు. అలాంటిది తమను కోవర్టు లుగా ముద్ర వేస్తారా? అంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్ర పూరితంగా కాంగ్రెస్‌ను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. బయట నుంచి వచ్చిన వారికి తమను ప్రశ్నించే స్థాయి లేదని చెప్పారు.