Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భోజ్రెడ్డి మహిళా ఇంజినీరింగ్ కాలేజ్ స్థాపించి 25 ఏండ్లు గడిచిన సందర్భంగా రజతోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కట్టా నర్సింహరెడ్డి హాజరయ్యారు. మహిళా సాధికారత విషయంలో కాలేజీ అంకిత భావాన్ని వైస్ ఛాన్సలర్ కొనియాడారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రతి విభాగంలో కళాశాల పరిధిలో విద్యలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థినులను స్వర్ణ, రజత పతకాలతో సత్కరించారు. వేడుకల్లో విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్ర మాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో విద్యాపీఠం అధ్యక్షురాలు డాక్టర్ రామ లక్ష్మి, సెక్రెటరీ శ్రీరామరెడ్డి, అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ జి. రవీందర్ రెడ్డి, ఎగ్జిక్యు టీవ్ ఆఫీసర్ విజయలక్ష్మి, కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదనరెడ్డి పాల్గొన్నారు.