Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్ సోమేశ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వాణిజ్య పన్నుల విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందనీ, వ్యవస్థీకత ఆధారిత పన్ను అమలుపై దృష్టి సారించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. అస్సాం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో బీఆర్కేఆర్ భవన్లో భేటీ అయ్యారు. శాఖాపరంగా పలు యాప్‌లు, మాడ్యూల్స్‌ను అభివృద్ధి చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అన్ని నోటీసులు, ప్రొసీడింగ్ల జారీ మాన్యువల్‌గా ఇవ్వడం తొలగించామని అన్నారు. వ్యక్తిగత టార్గెట్ లు, విధుల ఆధారిత లక్ష్యాలతో ఈ యాప్‌లున్నాయని వివరించారు. కొత్తగా అనేక సర్కిళ్లను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర కమర్షియల్ టాక్స్ శాఖను పునర్వ్యవస్థీకరించామనీ, పరిశోధన, విశ్లేషణల కోసం ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశా మని తెలిపారు.
కాగా, అస్సాం రాష్ట్రంలో ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతి ద్వారానే శాఖాపరమైన కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నామని వారు చెప్పారు. తెలంగాణా ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి తమ రాష్ట్రంలో కూడా అమలు చేయనున్నట్టు వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ నీతూ ప్రసాద్, అదనపు కమిషనర్లు సాయి కిషోర్, అస్సాం కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిష నర్ బాసుమతరీ ఫూలేశ్వర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.