Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
రకరకాల వంటలు... పలురకాల రుచులు...కర్ణాటక వంటలతో ఆ ప్రాంగణం నిండిపోయింది. కర్ణాటక శిక్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ కాచిగూడలోని నృపతుంగా స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కర్ణాటక ఫుడ్ ఫెస్టివల్‌కు ప్రజలు వేలాది మందిగా తరలివచ్చారు. 96 ఏండ్లుగా విద్యారంగంలో సేవలందిస్తున్న కర్ణాటక శిక్షణ సమితి తొలిసారిగా ఈ ఫుడ్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో బిసిబెలాబాత్ నుంచి నీరు దోశ వరకు అన్ని రకాల వంటలు, పాపుల్ ఫుడ్ ఐటమ్స్, దర్వాడా పేడతో స్టాల్స్ ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. మొత్తం 104 స్టాల్స్ ఏర్పాటు చేయగా ప్రతి స్టాల్ ఆహార ప్రియులతో రద్దీగా మారింది. ఒక రోజు ప్రదర్శనను రాష్ట్ర సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ ప్రారంభించారు. రాష్ట్రం సెక్యులర్ భావాలతో ముందుకెళ్తున్నదనీ, అన్ని వర్గాల ప్రజల ఆసక్తులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక శిక్షణ సమితి అధ్యక్షులు టి.రామ్మూర్తి, కార్యదర్శి ముకుంద్ కులకర్ణి, కో ఆర్డినేటర్ సురేంద్ర కులకర్ణి, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.