Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో గణనీయమైన ఫలితాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణకు హరితహారం అద్భుతమైన కార్యక్రమమనీ, ఎనిమిదేండ్లుగా ఈ పథకం అమలుతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని తమిళనాడు అడిషనల్ చీఫ్ సెక్రటరీ సుప్రియా సాహు తెలిపారు. ఈ తరహాలోనే తమిళనాడు గ్రీన్ మిషన్ కార్యక్రమం అమలు చేయటం ద్వారా 33శాతం పచ్చదనం సాధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. హరిత హారం కార్యక్రమాన్ని అధ్యయనం చేసేందుకు శనివారం సుప్రి యా సాహు రాష్ట్రంలో పర్యటించారు. ముందుగా అరణ్య భవన్ లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి, పీసీసీఎఫ్, హెచ్ఓఓఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, అధికారులతో సమావేశమయ్యారు. ఎనిమిదేండ్లుగా హరితహారం అమలు, ఫలితాలపై పీసీసీఎఫ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పచ్చదనం పెంపును రాష్ట్రం ప్రభుత్వం ప్రాధాన్యతా పథకంగా అమలు చేసిందని వివరించారు.
త్వరలో తెలంగాణ అధికారుల బృందాన్ని తమిళనాడుకు అహ్వానిస్తామనీ, తమ అధికారులకు ఈ పథకం అమలు తీరును వివరించేలా చర్యలు తీసుకుంటామని సాహూ తెలిపారు.