Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ఆయుష్ శాఖ కార్యదర్శి రాజేష్ కొటేచా శుక్రవారం వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌రావుతో సమావేశమయ్యారు. బి.ఆర్.కె.ఆర్ భవన్లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ఆయుష్ కార్యక్రమాలపై కేంద్ర కార్యదర్శి రాజేష్ కొటేచాకు హరీష్‌రావు వివరించారు. ఈ సందర్బంగా రాజేష్ కోటేచాను మంత్రి ఘనంగా సన్మానించారు.