Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనవరి రెండో తేదీన కేరళకు బయల్దేరి వెళ్లనున్నారు. అక్కడి కన్నూరులో నిర్వహించే ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్కు ఆమె హాజరు కానున్నారు. ఆ సమావేశాలను ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రారంభిస్తారు. అదే రోజు అక్కడ చేపట్టబోయే సాంస్కృతిక ఉత్సవాలకు కూడా కవిత హాజరవుతారు. మూడో తేదీన సంస్కృతి అనే అంశంపై నిర్వహించే చర్చాగోష్టిలో ఆమె పాల్గొంటారు.