Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ చైతన్య పర్యటనకు శ్రీకారం
- బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేశ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గడిచిన డెబ్భై ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ హయాంలో బీసీలు నష్టపోయారని బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు . ఉమ్మడి రాష్ట్రంలోని మురళీధర్ రావు కమిషన్ సూచనల మేరకు నాటి ప్రభుత్వం స్థానిక సంస్థలకు బీసీ రిజర్వేషన్లు 44 శాతనికి పెంచాయని గుర్తుచేశారు. శాస్త్రీయమైన నివేదిక లేదన్న కారణంతో తిరిగి బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి కుదించగా సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 52 శాతనికి ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. బీసీ కార్పొరేషన్లకు, ఫెడరేషన్లకు ఎనిమిదేండ్లుగా పాలక మండళ్లు లేకుండా చేశారని తెలిపారు.