Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జువైనల్ హౌమ్‌లో ఆర్చరీ విద్య ( విలు విద్య) శిక్షణనిస్తున్నట్టు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని గాజులరామారంలోని జువైనల్ స్పెషల్ హౌంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ రిటైల్ అవుట్లెట్కు, కొత్త అదనపు భవన సముదాయం నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన శారు. అనంతరం తెలంగాణ జువెనైల్ ఆర్చరీ అకాడమిని ప్రారంభించారు. అనంతరం ప్రాంగణంలోని మోడల్ న్యూట్రి గార్డెన్‌ను మంత్రి ప్రారంభించి, పలురకాల పూలు, పళ్ళ మొక్కలను నాటారు. ఆర్చరీ అకాడమీని ప్రారంభించిన మంత్రి విద్యార్థులతో కలసి ధనస్సు సంధించి వారిని ఉత్తేజపరిచారు