Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవయవదానం కోసం అందరూ కలిసి పనిచేయాలి
- మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ- బంజారాహిల్స్
నిమ్స్‌లోనే చాలా వరకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్లు జరుగుతున్నాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో దాదాపు రూ.2 కోట్లతో సమకూర్చుకున్న ఇంట్రా ఆపరేటివ్ ఆల్ట్రా సౌండ్, ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్, ఆల్ట్రా సోనిక్ ఆస్పిరేట్ వైద్య పరికరాలను ట్రామా బ్లాక్ (ఈఎండీ) అత్యవసర విభాగంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణతో కలిసి శనివారం మంత్రి ప్రారంభించారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేలా వాస్క్యులర్ సర్జరీ సింపోసియం నిర్వహించడం గొప్ప విషయమని మంత్రి అన్నారు. నిమ్స్‌ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. డిస్పెన్సరీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్టు చెప్పారు. ఎంబీబీఎస్ సీట్లు నాలుగింతలు పెంచామని.. పీజీ సీట్టు రెండింతలు చేశామన్నారు. నెలకు మూడు, నాలుగు ఎయిర్ అంబులెన్స్‌లు ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు. అత్యధిక ట్రాన్స్‌ప్లాంట్ జరిగేది హైదరాబాద్‌లోనే అన్నారు. పేదల వైద్యం కోసం ఆరోగ్య శ్రీ కింద రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. అనవసర పరీక్షలు చేయొద్దని, అనవసర మందులు వద్దని.. ప్రజలపై భారం మోపొద్దని వైద్యులకు సూచించా రు. అవయవదానం కోసం అందరూ కలిసి పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సింగిల్ యూజ్ ఫిల్టర్ డయాలసిస్ విధానాన్ని అందు బాటులోకి తెచ్చి.. దేశంలోనే తెలంగాణ తొలి రాష్ట్రంగా నిలిచిందన్నారు. డయాలసిస్ చేయించుకుంటున్న వారికి బస్ పాస్, పింఛన్లు, మందులు ఉచితంగా అందజేస్తారన్నారు. డయా లసిస్కు ప్రభుత్వం ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. అత్యాధునిక వైద్య పరికరాల కోసం రూ.150 కోట్లు మంజూరు చేశామన్నారు. శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి రోగాలను నివారించుకో వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దామోదర్ రెడ్డి, డాక్టర్ గంగాధర్, వైద్య బృందం హెచ్ఓడీ, న్యూరాలజీ వైద్య బృందం, వాస్క్యులర్ వైద్య బృందం, జూనియర్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన నర్సులు
నిమ్స్‌లో మంత్రి హరీశ్‌రావును నర్సులు కలిశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 25 రోజుల నుంచి శాంతియుతంగా నిరసన తెలుపు తున్నామని చెప్పారు. 200 మంది ఉన్నామని, నిమ్స్ పెన్షన్ స్కీమ్ కావాలని, దానికి సహకారాన్ని అందించాలని మంత్రిని కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. మంత్రిని కలిసిన వారిలో కనకతార, శాంతి తదితరులు ఉన్నారు.