Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతదేహానికి మంత్రి మల్లారెడ్డి నివాళి
నవతెలంగాణ-జవహర్‌నగర్
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో పాఠశాలకు వెళ్లి అదృశ్యమై శుక్రవారం దమ్మాయిగూడ చెరువులో శవమై తేలిన 10 ఏండ్ల చిన్నారి ఇందు అంత్యక్రియలు శనివారం ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పోలీసుల పహారా మధ్య ఇందు అంతిమయాత్ర కొనసాగింది. జవహర్‌నగర్ వాసులు చిన్నారికి కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకుముందు అంబేద్కర్‌నగర్‌లో చిన్నారి మృతదేహానికి కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నివాళ్లర్పించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చి తక్షణ సాయంగా రూ.లక్ష అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిన్నారి మృతి బాధాకరమైందన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని చెప్పారు. జవహర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో గంజాయిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని.. ఈ విషయంపై ఉన్నతాధి కారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. దాతల సహాయంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. బాధిత కుటుంబంలో ఇద్దరు పిల్లలను గురుకులంలో చదివించేలా చర్యలు తీసుకుంటామ న్నారు. ఇందు మృతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశిం చారు. మంత్రి వెంట జవహర్‌నగర్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, బీఆర్ఎస్ జవహర్‌నగర్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు.