Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాదంలో భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం
- న్యాయం కోసం నిలబడాలి.. అన్యాయంపై ప్రశ్నించాలి
- తెలంగాణ గడ్డపై మతోన్మాద బీజేపీని రానివ్వం
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ముదిగొండ
పేదల సమస్యల కోసం నిలబడి, కొట్లాడి ప్రశ్నించి, విజయాలు సాధించి న్యాయానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచేది కమ్యూనిస్టులేనని, భవిష్యత్ ఎర్రజెండాదే అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేట గ్రామంలో శనివారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. రాజకీయాలంటే డబ్బు, అధికారం, ఓట్లు, సీట్లు కావన్నారు. ప్రజల పక్షాన న్యాయం కోసం నిలబడి అన్యాయం జరిగితే ప్రశ్నించడమే కమ్యూనిస్టు సిద్ధాంతమన్నారు. ప్రాంతీయ పార్టీలు ఒక ప్రాంతానికే పరిమితమై ఉంటాయన్నారు. సీపీఐ(ఎం), ఎర్రజెండా విశ్వవ్యాప్తంగా భూమి ఉన్నంతవరకు ఉంటాయన్నారు. వ్యవసాయం చేసే రైతుకు ఒక సంవత్సరం కలిసి రానంత మాత్రాన, సాగు మానుకోలేడని, అలాగే సీపీఐ(ఎం)కి తాత్కాలికంగా ఒడిదుడుకులు వచ్చినా భవిష్యత్తులో ప్రజలకు దిక్సూచి, ప్రత్యామ్నాయం ఎర్రజెండేనని చెప్పారు. కేరళ రాష్ట్రంలో ఆదర్శవంతమైన ప్రజాపాలన సాగుతోందన్నారు. రైతుల ధాన్యానికి అత్యధిక మద్దతు రేటు ఇస్తుందన్నారు. కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి కరోనాను కట్టడి చేసి ప్రజా ఆరోగ్యాలను కాపాడటంలో కేరళ రాష్ట్రం అగ్రభాగాన నిలిచిందని గుర్తు చేశారు. తెలంగాణ గడ్డపై మతోన్మాద బీజేపీ రాకుండా చేయటమే సీపీఐ(ఎం) లక్ష్యమన్నారు. ఆర్ఎస్ఎస్, సంఘపరి వార్ శక్తుల సిద్ధాంతాన్ని దేశంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేసి ప్రజలపై దాడులు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ మతోన్మాద సిద్ధాంతాన్ని, మనువాదాన్ని మట్టిలో కలుపుతామన్నారు. అమ్మపేట, బాణాపురం, ముదిగొండ ప్రాంతాల్లో వందలాది కూలి, వర్గ పోరాటాలను నిర్మించిన చరిత్ర సీపీఐ(ఎం) దేనన్నారు. అమరవీరుల కోయ బాబు, గండ్లూరి, గండ్ర వీరభద్రారెడ్డి, బాజీ హను మంతు వారసత్వాన్ని కొనసాగించాలన్నారు. బీజేపీ ఫాసిస్టు విధానాలతో దేశ ప్రజలు కుదేలవుతున్నా రని చెప్పారు. భారత రాజ్యాంగం స్థానంలో మను వా దాన్ని అమలు చేసి దేశాన్ని నాశనం చేయటా నికి యత్నిస్తున్నారని చెప్పారు. ఈ కుట్రలను తిప్పు కొట్టేందుకు దేశభక్తులు, లౌకికవాద పార్టీలు ముం దుకు రావాలన్నారు. అనంతరం అమ్మపేట, బాణా పురం గ్రామాలకు చెందిన 24 కుటుంబాలు సీపీఐ (ఎం) సీనియర్ నాయకులు ఊటుకూరి గోపయ్య, మేకపోతుల వెంకన్న ఆధ్వర్యంలో తమ్మినేని సమ క్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమం లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంక టేశ్వరరావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్య దర్శి వర్గసభ్యులు బండి రమేష్, నాయ కులు వాసి రెడ్డి వరప్రసాద్, బండి పద్మ, మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.