Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన అదనపు డీజీ విజరుకుమార్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
డీజీపీ కార్యాలయంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ మెగా శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ శిబిరాన్ని పోలీసు సంక్షేమ విభాగం అదనపు డీజీ విజరుకుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఒమెగా ఆస్పత్రి ఆధ్వర్యాన ఐదుగురు క్యాన్సర్ నిపుణులు, 50 మంది వైద్య సిబ్బందితో ఈ శిబిరం సాగింది. ఇందులో డీజీపీ కార్యాలయానికి చెందిన అనేక మంది మహిళా ఉద్యోగులతో పాటు మహిళా పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు, పోలీసు గృహనిర్మాణ సంస్థకు చెందిన పలువురు మహిళా ఉద్యోగులు ఈ శిబిరంలో క్యాన్సర్ నిర్దారణకు సంబంధించిన పరీక్షలను చేయించుకున్నారు. ఈ సందర్భంగా అదనపు డీజీ విజరు కుమార్ మాట్లాడుతూ.. ఏదేనీ అనారోగ్యానికి సంబంధించి ముందుగానే రోగ నిర్ధారణ చేసుకోవటం వలన అవి తీవ్ర రూపం దాల్చకముందే తగిన నివారణ చర్యలు తీసుకోవచ్చని అన్నారు. ముఖ్యంగా, క్యాన్సర్ వంటి రోగాలకు సంబంధించి పురుషులతో పాటు ప్రత్యేకించి మహిళలు ముందుగానే రోగ నిర్దారణ పరీక్షలు చేసుకోవట వలన దాని ద్వారా వచ్చే విపత్తు నుంచి బయట పడటానికి వీలవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.