Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెటిరో డ్రగ్స్ పరిశ్రమలో చిరుత కలకం
- మత్తు ఇంజక్షన్ ఇచ్చి బంధించిన అధికారులు
- జూపార్కుకు తరలింపు
నవతెలంగాణ-ఐడీఏ బొల్లారం
ఎట్టకేలకు సంగారెడ్డి జిల్లా జిన్నారంలో చిరుత చిక్కింది. జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో డ్రగ్స్ పరిశ్రమలోకి శనివారం శనివారం తెల్లవారుజామున చిరుత ప్రవేశించింది. పరిశ్రమలోని ఎఫ్ బ్లాక్లో దాగి ఉన్న చిరుతను గమనించిన కార్మికులు భయాందోళనకు గురై వెంటనే బయటకు వచ్చి తాళాలు వేశారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బోను, వల ఏర్పాటు చేశారు. సుమారు 8 గంటలపాటు శ్రమించినా చిరుత చిక్కలేదు. చివరకు హైదరాబాద్ నుంచి వచ్చిన జూ అధికారులు తుపాకీ ద్వారా చిరుతకు మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో మత్తులోకి జారుకుంది. ఆ తర్వాత చిరుత బోనులో బంధించారు. అనంతరం హైదరాబాద్ జూపార్కుకు తరలించారు. మూడు నెలల కిందట ఇదే పరిశ్రమలోని ఇదే బ్లాకులో చిరుత సంచరించి వెళ్లింది.