Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీని, రేవంత్‌రెడ్డిని బలహీనపర్చే కుట్ర జరుగుతున్నదని మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 26 నుంచి పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తుంటే, పాదయాత్రను దెబ్బతీయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ ముసుగువీరులు ఇప్పుడు బయటకు వచ్చారన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినప్పుడు సేవ్ కాంగ్రెస్ ఎందుకు గుర్తు రాలేదు? ఆనాడు పీసీసీగా ఉన్నవాళ్లు ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఉత్తమ్ ఏం చేశారని ప్రశ్నించారు. సీనియర్లు పార్టీకోసం పనిచేస్తే మునుగోడులో 50వేల ఓట్లతో గెలిచే వాళ్లమని పేర్కొన్నారు. సునీల్ కనుగోలు కార్యాలయంపై దాడి జరిగితే సీనియర్లు ఎక్కడికి పోయారని నిలదీశారు. మీ లోపాయికారీ ఒప్పందం భాజపాతోనా లేక బీఆర్ఎస్తోనా? అని ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్వార్థం కోసం టీడీపీతో పొత్తు పెట్టుకోలేదా? అని ప్రశ్నించారు. సీఎల్పీనేత భట్టిి కమిటీల సమాచారం లేదనేది అసత్యమన్నారు. 'సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారు.. పార్టీ నేతలపై ఆయన ఎందుకు పోస్టులు పెడతారు? ఉత్తమ్‌పై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్టు ఆధారాలు ఉన్నాయా? సీపీ సీవీ ఆనంద్ ఎలా చెబుతారనీ, దాన్ని మీరెలా నమ్ముతారు?' అని ప్రశ్నించారు.