Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ రెడ్కో చైర్మెన్ వై సతీష్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఇండ్లు, ఆఫీసులు, ఇతర ప్రాంతాల్లో లైట్లు, ఫ్యాన్లు, ఏసీలను ఇష్టం వచ్చినట్టు వినియోగించవద్దని టీఎస్ రెడ్కో చైర్మెన్ వై సతీష్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌ను పొదుపుగా వాడితే, పర్యావరణాన్ని పరిరక్షించినట్టే అని చెప్పారు. ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆధ్వర్యంలోని ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ నిర్వహించిన ఎనర్జీ వాక్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఖైరతాబాద్‌లోని ఇంజినీర్స్ ఇనిస్టిట్యూట్ భవనం దగ్గర ప్రారంభమైన వాక్.. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ నుంచి తిరిగి ఇంజినీర్స్ ఇనిస్టిట్యూట్ వరకు సాగింది. ఈ సందర్భంగా రెడ్కో చైర్మెన్ వై సతీష్ రెడ్డి మాట్లాడుతూ కర్బన ఉద్గారాలను తగ్గించడానికి విద్యుత్ పొదుపు కూడా ఓ భాగమన్నారు. ఇంధన వాడకం పెరిగి, ప్రపంచం కాలుష్యమయం అయిపోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని బహుమతిగా ఇవ్వాలని సూచించారు. ఇంధన పరిరక్షణ, కాలుష్య రహిత పర్యావరణం కోసం రెడ్కో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నా మన్నారు. ఎనర్జీ వాక్ లో పలు కాలేజీలకు చెందిన విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్సీసీ కేడెట్లు పాల్గొన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ చైర్మెన్ బ్రహ్మరెడ్డి, ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ చైర్మెన్ శ్రీనివాసాచారి, ఇంజినీర్స్ ఇనిస్టిట్యూట్ సభ్యులు, పలు కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.