Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆదిలాబాద్/బాసర
నిర్మల్ జిల్లా బాసర అర్జీయూకేటి యూనివర్సిటీలో పియుసి 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆదివారం హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. గమనించిన తోటి విద్యార్థులు యూనివర్శిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు.దీంతో యూనివర్శిటీ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి ఎస్సై మహేష్ యూనివర్శిటీ పోలీసులు చేరుకొని మృత దేహాన్ని కిందికి దించి మృతుని జేబు నుండి లెటర్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. మృతి చెందిన విద్యార్థి రంగారెడ్డి జిల్లా మంచాల్ మండలం రంగపూర్ గ్రామానికి చెందిన భాను ప్రసాద్(17) గా గుర్తించారు.మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. విద్యార్థి ఆత్మహత్య మధ్యాహ్నం చేసుకుంటే రాత్రి వరకు బయట పెట్టకపోవడంపై పలు అనుమానలు వ్యక్తం అవుతున్నాయి. వ్యక్తిగత కారణాలతో చనిపోయి ఉంటారని యూనివర్సిటీ అధికారిక వర్గాలు చెబుతున్నాయి.