Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల ఎదుట లొంగిపోయిన సాదిక్
నవతెలంగాణ-ముషీరాబాద్
రాత్రి పూట ఫోన్ ఎక్కువగా మాట్లాడుతున్నదన్న కోపంతో సవతి తండ్రి తన కూతురిని గొంతు నులిమి హత్యచేసిన దారుణ ఘటన హైదరాబాద్‌లోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాకారంలో ఆదివారం జరిగింది. ఇన్స్పెక్టర్ జాహంగీర్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బాకారానికి చెందిన రహీం ఉన్నీసా, షేక్ అక్బర్ దంపతులకు షేక్ ఆయాజ్, షేక్ నౌ సిన్ ఉన్నిసా, షేక్ యాస్మిన్ ఉన్నీసా(17) ముగ్గురు సంతానం. కాగా పదేండ్ల కిందట షేక్ అక్బర్ తాండూరులో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందాడు. అనంతరం 2012లో రహీమున్నీసా మహమ్మద్ సాదిక్‌ను రెండో పెండ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఆమె తన కుమారుడిని తన తల్లి వద్ద ఉంచింది. అలాగే తన తండ్రి ఇద్దరు కూతుళ్లతోపాటు మహమ్మద్ సాదిక్‌తో కలిసి బాకారం లో నివాసముంటోంది. యాస్మిన్ ఉన్నిసా 9వ తరగతి వరకు చదువుకుని ఇంటి వద్ద ఉంటోంది. యాస్మిన్ రాత్రి పూట తరచూ ఫోన్లో మాట్లాడు తుండటంతో తండ్రి సాదిక్‌కు నచ్చేది కాదు. శనివారం మద్యం మత్తులో ఉన్న సాదిక్ ఇంటికి చేరుకునే సరికి యాస్మిన్ ఫోన్లో మాట్లాడుతుం డటంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజా మున ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.