Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
రాష్ట్రంలో ఫార్మసీ రంగాన్ని ప్రోత్సహిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్సీ, రైతు బంధు కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని బోడు ప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏ టూ జెడ్ జనరిక్ మెడికల్ స్టోర్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఫార్మసీ రంగాన్ని అభివృద్ధి చేసి సామాన్య ప్రజలకు అవసరమైన మందులను అతితక్కువ ఖర్చుతో అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని తెలిపారు. భవిష్యత్తులో బీ ఫార్మసీ చదివిన దళిత విద్యార్థులకు దళిత బంధు ద్వారా జనరిక్ మెడికల్ స్టోర్లు ఏర్పాటు చేసుకునే సదుపాయాన్ని కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, స్థానిక కార్పొరేటర్ జడిగే మహేందర్ యాదవ్, బీఆర్ఎస్ బోడుప్పల్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, అద్విత గ్లోబల్ మెడికల్ ప్రయివేట్ లిమిటెడ్ నిర్వహకులు సురేష్, హరీష్, ఏ టూ జెడ్ మెడికల్ స్టోర్ నిర్వహకులు తోట సతీష్, బీఆర్ఎస్ నాయకులు, పాల్గొన్నారు.