Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదే రోజు కాంగ్రెస్ జెండా పండుగ
- డీజీపీ పదవి కోసం సీవీ ఆనంద్ అబద్ధాలు
- అంతర్గత సమస్యలను అధిష్టానమే పరిష్కరిస్తుంది : రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ సర్కారు, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం...ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని వివరించేందుకు (యాత్ర ఫర్ ఛేంజ్) జనవరి 26 నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నట్టు టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అంతలోపు గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయి కమిటీలను పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. జనవరి 26న గ్రామ,గ్రామానా కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ నిర్వ హించాలని కోరారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ వైఫల్యాలపై చార్జిషీట్ పేరుతో ఇంటింటికి కరపత్రం పంచు తామని చెప్పారు. కాంగ్రెస్ జోథ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, మైనా ర్టీలు, బీసీలకు 50 శాతం పదవులు ఇవ్వాలని నిర్ణయించిందనీ, దాని ప్రకా రమే రాష్ట్రంలో 66శాతం పదవులు ఆయా తరగతుల కు ఇచ్చామని గుర్తు చేశారు. ఆది వారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో రేవంత్ అధ్యక్షతన నూతన కార్యవర్గం సమావేశమైంది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చి ంచారు. భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించారు. సమావేశంలో తీసుకు న్న నిర్ణయాలను పార్టీ నేతలు అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, సుద ర్శన్‌రెడ్డి, మల్లురవి, చెరుకు సుధాకర్, శంకర్‌నాయక్, దర్పల్లి రాజశేఖర్‌రెడ్డితో కలిసి రేవంత్ విలేకర్లతో మాట్లాడా రు. నూతన జిల్లా అధ్యక్షులు క్షేత్రస్థా యి కమిటీలను నియమించాలని కో రారు. కాంగ్రెస్ ఎన్నికల నియామ వాళి, ప్రభుత్వాల వైఫల్యాలపై జనవరి 3,4,5 తేదీల్లో మేధావులతో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. డిజిటల్ సభ్య త్వం పొందిన 43 లక్షల మందికి రెండు లక్షల బీమా సౌకర్యంతోపాటు రానున్న ప్రభుత్వంలో సరైన అవకాశా లు కల్పించనుందని భరోసా ఇచ్చారు. పార్టీ కార్యక్రమాల ను, ప్రభుత్వ వైఫ ల్యం సోషల్‌మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని పార్టీ కార్యకర్తలను కోరారు. పార్టీ అంతర్గత సమస్యలను అధిష్టానం పరిష్కరిస్తుందని ఆశాభా వం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకు లపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పోలీ సు కమిషనర్ సీవీ ఆనంద్ అబద్ధాలు చెప్పి పార్టీలో అంత ర్గత సమస్యలు సృష్టిస్తున్నారని ఆరో పించారు. కాంగ్రెస్ వార్‌రూమ్ పోలీ సులు రౌడీము కలుగా వ్యవహరిం చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఐటీ, ఐఐఎం చదవిన మేధావులపై క్రైమ్ పోలీసు స్టేషన్లతో అర్థనగంగా కూర్చొ బెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సంబ ంధించిన ఎన్నికల వ్యూహానికి సంబ ంధించిన సమాచా రాన్ని దొంగిలిం చారని ఆరోపించారు. డీజీపీ పదవి కోసం టీఆర్ఎస్ బ్రోకర్‌గిరి చేస్తున్నా రని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ నా యకులు చిన్న సౌకర్యాల గురించి ఆలోచించకుండా ప్రజలు ఎదుర్కొం టున్న పెద్ద పెద్ద అసౌకర్యాల గురించి పోరాటం చేయాలన్నారు.