Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
షాద్‌నగర్ ప్రాంతంలో దిశ లైంగిక దాడి ఘటనలోని నిందితులు నలుగురి ఎన్కౌంటర్ బూటకమని పేర్కొంటూ దాఖలైన రిట్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ వాయిదా పడింది. ముహమద్ ఆరిఫ్, సిహెచ్ చెన్నకేశవులు, జె శివ, జె నవీన్‌లను పోలీసులు కావాలనే ఎన్కౌంటర్లో హతమార్చారంటూ పిటిషనర్ సీనియర్ న్యాయవాది వింద్రా గోవర్ వాదించారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలతో రిపోర్టు ఇచ్చిందన్నారు. ఈ ఘటనలో పాల్గొన్న పది మంది పోలీసులపై 302 వంటి ఐపీసీ సెక్షన్ల కింద కేసు పెట్టేలా ఉత్తర్వులివ్వాలంటూ కోరారు. నిందితులు నలుగురిపై పోలీసులు కేసు పెట్టారనీ, ఇది చాలా దారుణమని అన్నారు. నకిలీ ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు శిక్షపడేలా కేసు నమోదు చేయాల్సిన అవసరముందన్నారు. విచారణను వచ్చే ఏడాది జనవరి రెండో తేదీకి వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సారధ్యంలోని డివిజన్ బెంచ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దిశ అనే యువతిని నిందితులు లైంగిక దాడితోపాటు హత్య చేసి ఆపై కాల్చేశారంటూ పోలీసులు కేసు పెట్టారు. నిందితుల్ని కస్టడీకి తీసుకున్న పోలీసులు తర్వాత అదే ప్రాంతానికి తీసుకెళ్లి విచారణ చేస్తుండగా ఆత్మరక్షణ పేరుతో ఎన్కౌంటర్ నిర్వహించారు. నలుగురి ఎన్‌కౌంటర్‌పై హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టుకు అందిన లేఖను పిటిషన్‌గా పరిగణించి విచారణ జరుపుతుండగానే సుప్రీంకోర్టు ముగ్గురితో ఏర్పాటు చేసిన కమిషన్‌తో నివేదిక తెప్పించుకుంది. ఎన్‌కౌంటర్‌పై కమిషన్ అనుమానాలను వ్యక్తం చేయడంతో దీనిపై సమగ్రంగా విచారణ చేయాలంటూ తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. సోమవారం మొదలైన విచారణ జనవరి రెండో తేదీకి వాయిదా పడింది.