Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతుడు కార్పొరేటర్ మేనల్లుడు
నవతెలంగాణ-ధూల్‌పేట్
హైదరాబాద్ పాతబస్తీలో కార్పొరేటర్ కార్యాలయంలో అతని మేనల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం జీహెచ్ఎంసీ పరిధిలోని లలిత్‌బాగ్ ఎంఐఎం కార్పొరేటర్ కార్యాలయంలో యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన యువకున్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లలితాబాగ్‌కు చెందిన ఎంఐఎం కార్పొరేటర్ ఆజం షరీఫ్ కార్యాలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. కార్పొరేటర్ ఆజం షరీఫ్ సోదరి కొడుకు సయ్యద్ ముర్తుజా(18)పై కత్తులతో దాడి చేశారు. ముర్తుజా బంజారాహిల్స్‌లోని అన్వర్ ఉలూమ్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. అయితే, స్నేహితుల మధ్య గొడవే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది.