Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అక్కిరెడ్డి సంజీవరెడ్డి బీఆర్ఎస్లో చేరారు. సోమవారం హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అక్కిరెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు కరకగూడెం సర్పంచ్ ఊకే రామనాథం, మదర్ సాహెబ్, సోమరాజు, కుడితిపుడి కోటేశ్వరరావు, బూర నర్సయ్య, జి.నరసయ్య, సుబ్బారావు, నిమ్మ లింగారెడ్డి కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ మంచి విజయాలు సాధించబోతున్నదనీ, అందరూ కలిసి కట్టుగా విజయం ఏకపక్ష మయ్యేలా పనిచేయాలని సూచించారు. పినపాక నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వానికి ప్రత్యేక దృష్టి ఉందన్నారు.