Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరుణపతాకం ఆవిష్కరించిన రాజారావు
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
బుధవారం నుంచి సిద్ధిపేట పట్టణంలో జరిగే సీఐటీయూ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం సీనియర్ నాయకులు పి రాజారావు పిలుపునిచ్చారు. మహాసభలను పురస్కరించుకొని ఆ యూనియన్ రాష్ట్ర కార్యాలయం వద్ద సోమవారం ఆయన అరుణపతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె వెంకటేశ్, భూపాల్, ఎస్వి రమ, ఉపాధ్యక్షులు ఆర్ కోటంరాజు, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి ఆశయ్య, సీఐటీయూ రాష్ట్ర నాయకులు కూరపాటి రమేశ్, శ్రీకాంత్, సోమయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.