Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభినందించిన తెలంగాణ చెస్ అసోసియేషన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రానికి చెందిన చెస్ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ స్పెయిన్ ఛాంపియన్‌షిప్‌లో విజయం సాధించాడు. అక్కడ జరిగిన 9వ చెస్బుల్ సన్వే సిట్జ్సె ఇంటర్నేషనల్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్లో ఆయన 20వ సీడ్ ఆటగాడిగా నిలిచి, టైటిల్ గెలుచుకున్నాడు. 9 రౌండ్లలో జరిగిన పోటీల్లో 805 పాయింట్లు సాధించారు. 30 దేశాలకు చెందిన చెస్ క్రీడాకారులతో రిత్విక్ పోటీ పడ్డారు. అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఉక్రెయిన్, ప్రాన్స్, నార్వే, స్పెయిన్ వంటి దేశాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. రిత్విక్ 8 గేముల్లో విజయం సాధించి, ఒక గేమ్‌ను డ్రాగా ముగించాడు. హైదరాబాద్‌లోని కేఎల్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంజినీరింగ్ చదువుతున్న రిత్విక్, రేస్ చెస్ అకాడమీలో ఎన్ రామరాజు వద్ద శిక్షణ పొందారు. రిత్విక్ విజయంపై తెలంగాణ స్టేట్ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు కేఎస్ ప్రసాద్ అభినందనలు తెలిపారు. అతను భవిష్యత్‌లో మరిన్ని గ్రాండ్‌మాస్టర్ పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.