Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హంస హౌమియో మెడికల్ కాలేజీలో బోధనాస్పత్రిని ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
నవ తెలంగాణ-ములుగు
పౌష్టికాహారం అందని గర్భిణులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రారంభించబోతున్నదని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గర్భిణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తారన్నారు. తద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించవచ్చని చెప్పారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరాసాగర్ గ్రామంలో హంస హౌమియో మెడికల్ కాలేజీలో 75 పడకల బోధనాస్పత్రిని సోమవారం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించి మాట్లాడారు. ఆయూష్‌కు మంచి భవిష్యత్ ఉందని, సంప్రదాయ వైద్యానికి ప్రాధాన్యత పెరుగుతున్నదని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో బస్తీ, పల్లె దవాఖానా లు తెచ్చామన్నారు. పల్లె దవాఖానాల్లో పని చేసేందుకు ఆయూష్ డాక్టర్లను రిక్రూట్ చేస్తున్నామని చెప్పారు.