Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
టీడీపీ జాతీయ నేత చంద్రబాబు హాజరయ్యే ఈనెల 22 ఖమ్మం బహిరంగసభను విజయవంతం చేయాలని తెలుగుదేశం తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం సభ టీడీపీ శ్రేణులకు పునరుత్తేజం కలిగిస్తుందని చెప్పారు. సోమవారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. బడుగుబలహీన వర్గాల ఊపిరి టీడీపీ అని వ్యాఖ్యానించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాతే ఉమ్మడిరాష్ట్రంలో నిజమైన స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు వచ్చాయని చెప్పారు. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దుతో పెత్తందారీ వ్యవస్థ అంతమైందని గుర్తు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజ్యాధికారం వచ్చిందని చెప్పారు. బడ్జెట్లో అందరికీ న్యాయమైన వాటా దక్కుతున్నదని వివరించారు. ఆధరణ, ముందడుగు, చేయూత వంటి పథకాలు టీడీపీ ప్రభుత్వాల హయాంలో వచ్చినవేనని తెలిపారు. లక్షలాధి కుటుంబాలకు ఆధునిక పనిముట్లు ఇచ్చారనీ, చేతివృత్తుల వారి స్వయం ఉపాధికి కృషిచేశారని చెప్పారు. చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, బీడీ కార్మికుల సంక్షేమానికి ఎంతో మేలు చేశారన్నారు. నష్టాల్లో ఉన్న సింగరేణికి కేంద్రం నుంచి రూ. 663 కోట్లు తెచ్చి లాభాల బాట పట్టించారని వివరించారు. అవుటర్రింగ్రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్ర యం, ఉర్దూ విశ్వవిద్యాలయం, నల్సార్ యూని వర్సిటీ, గచ్చిబౌటి స్టేడియం, ప్లైవోవర్లు, రోడ్ల విస్తరణ, సాగర్ నుంచి తాగునీరు. నిమ్స్, గాంధీ ఆస్పత్రులతో సహా అనేక ఆస్పత్రులు, జినోమ్ వ్యాలీ అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం పెంచిన ఘనత టీడీపీదేనని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయనీ, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇప్పటి ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంపన్న రాష్ట్రాన్ని రూ. ఐదు లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని చెప్పారు. ఈ పరిస్థితులను చక్కదిద్దా లంటే టీడీపీ ద్వారానే సాధ్యమన్నారు. తెలం గాణ అభివృద్ధి పునరం కితమయ్యే సభ ఖమ్మం సభ అని చెప్పారు. విలేకర్ల సమావేశంలో పార్టీ సమన్వయ కర్త , మాజీ ఎంపీ కంభంపాటి రా మ్మోహన్రావు, నాయకులు కాట్రగడ్డ ప్రసూన , అట్లూరీ సుబ్బారావు పాల్గొన్నారు.