Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈనెల 26నుంచి 28 వరకు
- 27న జాతీయ సదస్సు, మంత్రుల హాజరు
- ఆహ్వాన సంఘం వైస్ చైర్మెన్ చెరుపల్లి సీతారాములు వెల్లడి
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
వికలాంగుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఎన్పీఆర్డీ అఖిల భారత 3వ మహాసభ యాదాద్రిభువనగిరి జిల్లా భూదాన ్పోచంపల్లి మండలం దేశ్‌ముఖ్‌లో జరగనున్నట్టు ఆహ్వాన సంఘం వైస్ చైర్మెన్ చెరుపల్లి సీతారాములు వెల్లడించారు. సెయింట్ మేరీ విద్యాసంస్థల ప్రాంగణంలో ఈనెల 26 నుంచి 28 వరకు ఈ మహాసభ నిర్వహిస్తామన్నారు. పోచంపల్లి మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో సోమ వారం మహాసభ ఆహ్వానసంఘం సన్నాహక సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలిసారిగా అఖిల భారత మహాసభ జరగనున్నట్టు తెలిపారు. ప్రసిద్ధి పొందిన పర్యాటక ప్రాంతం పోచంపల్లి అన్నారు. అలాంటి మండలంలో జాతీయ మహాసభ జరగడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ సంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడేలా మహాసభ జరిపేందుకు ఆహ్వాన సంఘం కృషి చేస్తుందని తెలిపారు. వీటిని జయప్రదం చేయడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. దేశవ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను తయారు చేయడానికి ఈ మహాసభ దోహదపడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వికలాంగుల వ్యతిరేక విధానాలపై చర్చిస్తామన్నారు. పోరాడి సాధిం చుకున్న అనేక చట్టాలను మార్చేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి పైనా ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడం ద్వారా వికలాంగులు రిజర్వేషన్ సౌకర్యం కోల్పోతారని చెప్పారు.ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి ఎం.అడివయ్య మా ట్లాడుతూ.. మహాసభకు 22 రాష్ట్రాల నుంచి ప్రతి నిధులు హాజరవుతారని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఒకే పెన్షన్ విధానం, నామినేటెడ్ పదవుల్లో రిజ్వేషన్ల అమలు, రిజర్వేషన్లను పటిష్టంగా అమలు చేయక పోవడం, వికలాంగులపై దాడులు దౌర్జన్యాలు, మహిళావిక లాంగులపై లైంగిక వేధింపులపై చర్చిస్తామన్నారు. వికలాంగుల విద్యా, ఉపాధి, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారతపై 27న జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు.
కేరళ సోషల్ జస్టిస్ మంత్రి డాక్టర్ ఆర్.బిందు, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ డాక్టర్ కె.వాసుదేవరెడ్డి, డైరెక్టర్ బి.శైలజ, హెలెన్ కెళ్ళార్ విద్యాసంస్థల అధినేత ఉమర్ఖాన్, టీఏఎస్‌ఎల్‌పీఏ అధ్యక్ష కార్యదర్శులు నాగేందర్, ఇమద్ఖాన్, సెయింట్ మేరీ విద్యాసంస్థల చైర్మెన్ కేవీకే.రావు, శాస్త్రవేత్త పి.జాని హాజరవుతారని చెప్పారు. ఈ సమావేశంలో ఆహ్వాన సంఘం వైస్‌చైర్మెన్ టి.జ్యోతి, జహంగీర్, కొండమడుగు నర్సింహ, ఎన్పీఆర్డీ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.వరమ్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉపేందర్, ప్రజాసంఘాల నాయకులు అంజిరెడ్డి, లింగారెడ్డి, గూడూరి బుచ్చిరెడ్డి, మధు, విష్ణు, పరమేష్, నీలకంటి జంగయ్య, నోముల కృష్ణారెడ్డి, కె.బిచ్చయ్య, బి.పురుషోత్తమ్‌రెడ్డి, పి.భిక్షపతి, వి.మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.