Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్ సవాల్
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
'డ్రగ్స్ పరీక్ష కోసం రక్తం ఇచ్చేందుకు నేను సిద్ధం. అవసరమైతే జుట్టు, గోర్లు, కిడ్నీ కూడా ఇస్తా. చిత్తశుద్ధితో బయటకు వస్తా.. డ్రగ్స్ వాడినట్టు తేలకపోతే చెప్పు దెబ్బలు తినేందుకు సిద్ధమేనా.. కరీంనగర్ చౌరస్తాలో ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకుంటారా..? కరీంనగర్‌లోనే ఉంటా.. ఏ డాక్టర్‌ను తెచ్చుకుంటావో తెచ్చుకో' అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్తాయిలో స్పందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి కేటీఆర్.. బీజేపీ లక్ష్యంగావిమర్శలు సంధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. సెస్ ఎన్నికల్లో భాగంగా.. సిరిసిల్లలో మంత్రి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వేట కుక్కల్లాంటి కేంద్ర సంస్థలను ఉసుగొలుపుతారని తమకు ముందే తెలుసని.. మద్యం కేసులో కవితను విచారించటంపై కేటీఆర్ స్పందించారు. బండి సంజయ్ కరీంనగర్‌కు ఏం చేసిండో చెప్పడానికి చేతకాదు.. కానీ అరుపులు, పెడబొబ్బలు పెడుతుండు అని విమర్శించారు. 'భైంసాను దత్తత తీసుకున్న అంటున్నావు తీసుకో.. కానీ నీవు గెలిచిన నియోజకవర్గంలో ఏం చేశావు' అంటూ సంజయ్‌ని ప్రశ్నించారు. త్రిబుల్ ఐటీ కూడా తీసుకురాలేకపోయావంటూ ఎద్దేవా చేశారు. ఈ ఎంపీకి ఇప్పుడు వచ్చే బడ్జెట్ చివరి అవకాశం అని, ఇప్పటికైనా కరీంనగర్ ప్రజలకు ఏమైనా తీసుకురావాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడేందుకు కనీసం హిందీ, ఇంగ్లీష్ కూడా రాని ఎంపీ ఉండటం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎనిమిదేండ్లుగా సెస్ ముందుకు వెళ్తుందన్నారు. 2014 వరకు 34సబ్ స్టేషన్లు మాత్రమే వున్నాయని, 2014 తర్వాత అదనంగా 31సబ్ స్టేషన్లు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత వచ్చాయన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఎన్ని ధర్నాలు, రాస్తారోకోలు అయినాయో, అప్పుడు ఎన్ని సందర్భాల్లో కరెంటు పోతే సబ్‌స్టేషన్ సిబ్బందిని బంధించారో గుర్తు చేసుకోవాలన్నారు. సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో ఓటు వేసేది రైతులు, కార్మికులని, వారు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. నేతన్న కార్మికులకు, రైతులకు బీజేపీ ఏమైనా చేసిందా అంటూ ప్రశ్నించారు.