Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జనవరి 2వ తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలు ఆలయాల్లో జరిగే ప్రత్యేక పూజలకు ప్రసాదాలను పోస్టు ద్వారా అందచేస్తామని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ హైదరాబాద్ రీజియన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. భద్రాచలం, యాదాద్రి, ధర్మపురి దేవాలయ అంతరాలయాల్లో గోత్రనామాలతో జరిగే పూజలకు సంబంధించిన ప్రసాదాలను స్పీడ్ పోస్ట్ ద్వారా అందచేస్తామన్నారు. పశుపు, కుంకుమ, మిస్రీ, డ్రై ఫ్రూట్స్, పాకెట్ సైజ్ లామినేటెడ్ దేవుని ఫోటోను ఈ ప్యాకేజ్ ద్వారా అందచేస్తామని వివరించారు. రాష్ట్రంలోని 6,208 పోస్టాఫీసుల్లో ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయనీ, డిసెంబర్ 16 నుంచి వాటిలో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఆన్లైన్ ద్వారా కూడా ఈ సేవల్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.