Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద.మ.రైల్వే జీఎమ్ అరుణ్‌కుమార్ జైన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో భద్రతకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఆసంస్థ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు.మంగళవారంనాడాయన డివిజనల్ రైల్వే మేనేజర్ శరత్ చంద్రయాన్‌తో కలిసి క్షేత్రస్థాయిలో హైదరాబాద్ డివిజన్లోని డోన్ - కాచిగూడ సెక్షన్లో వార్షిక తనిఖీలు చేపట్టారు. మానవ రహిత ఎల్సి గేట్ దగ్గర భద్రతాంశాలను పరిశీలించారు. ట్రాక్ విధులు నిర్వహించే కార్మికులకు చలి నుండి రక్షణ పొందే జాకెట్లు, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ సిబ్బందికి పని పనిముట్లను పంపిణీ చేసారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఎల్సి నెం.164 లెవెల్ క్రాసింగ్ వద్ద 'అరుణ్ ఉద్యాన్' పార్కును ప్రారంభించి మొక్క నాటారు. . డోన్ - బోగోలు - వెల్దుర్తి సెక్షన్ల మధ్య ట్రాక్ వేగ సామర్ధ్య పరీక్షను నిర్వహించి రైల్వే ట్రాక్ మలుపులు, ఎత్తు పల్లాలు వద్ద భద్రతాంశాలను పరిశీలించారు.