Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో ఆరు నెలల పాటు సమ్మెపై సర్కారు నిషేధం విధిం చింది. ఈ మేరకు మంగళవారం వైద్యా రోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్మా 1971 చట్ట ప్రకారం.... అత్యవసర వైద్య సేవల్లో అంతరాయం కలగ కుండా, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.