Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి ఆశావర్కర్ల హెచ్చరిక
నవతెలంగాణ-కంఠేశ్వర్
తమ సమస్యలు పరిష్కరించకుంటే పోరా టానికి సిద్ధమ వుతామని ఆశావర్కర్లు ప్రభుత్వాన్ని హెచ్చరిం చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆశాలకు పనికితగ్గ వేతనం చెల్లించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 48 గంటల దీక్షలో భాగంగా రెండోరోజు మంగళవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశాలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ వద్ద ధర్నా చేపట్టారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే కమాన్, జిల్లా పరిషత్ సుభాష్‌నగర్, దుబ్బ మీదుగా కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాలతో వెట్టి చాకిరి చేయించుకుంటూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్నారు. కార్మికుల సమస్యలను పట్టించుకోవటం లేదని, కనీస వేతనాలు అమలు జరపకుండా వివక్షతను ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించని యెడల ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి గతంలో అధికారులు ఇచ్చిన హామీలు అమలు జరగటం లేదని వాటిని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌కి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆశా వర్కర్ల నాయకులు విజయ, రేణుక, శాంతి, లావణ్య, దివ్య, శోభ, నర్సు, లత తదితరులు పాల్గొన్నారు.