Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చంద్రబాబు, కాసాని హాజరు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి - హైదరాబాద్
తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో బుధ వారం మధ్యాహ్నం మూడు గం టలకు బహిరంగ సభ జరగనుంది. సభకు పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షతన జరిగే ఈ సభకు ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ సభలో రాష్ట్ర ఇన్ఛార్జ్ కంభంపాటి రామమోహన్ రావు , పొలిట్‌బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ సంఘాల అధ్యక్షులు, వివిధ పార్లమెంట్ల కార్యవర్గాలు పాల్గొంటారు. కావున మీరు ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కాసాని జ్ఞానేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు .
పర్యటన వివరాలు
ఉ.9 గం.లకు తమ నివాసం నుంచి బయలుదేరుతారు. ఉ.9.30 గం.కు రసూల్‌పుర ఎన్టిఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తారు. ఉ.9.45 గం.లకు ఈశ్వరీబాయి విగ్రహం కూడలి నుంచి హబ్సిగూడ, ఉప్పల్ చౌరస్తా, ఎల్బినగర్, హయత్‌నగర్ బస్‌డిపో, పెద్దఅంబర్‌పేట, రామోజీఫిలిం సిటీ, కొత్తగూడ, చౌటుప్పల్ మీదుగా మ.12.30 గం.కు టేకుమెట్ల బ్రిడ్జి వద్దకు చేరుకుంటారు.
మ. 2.15 గం.కు నాయకంగూడెం మీదుగా కూసుమంచి వస్తారు . మ.2.30 గం.లకు కేశవాపురం వద్ద ఎన్టిఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మ.3 గం.లకు ఖమ్మం చేరుకుంటారు. 3. 15గం.లకు మయూరి జంక్షన్ నుంచి ర్యాలీగా సర్దార్ పటేల్ స్టేడియం చేరుకుంటారు. సా. 4. 30 గం.లకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బహిరంగ సభ అనంతరం రాత్రి 7. 30గం.లకు స్టేడియం నుంచి బయలు దేరి వెంకటయ్య పాలెం మీదుగా చింతకానికి రాత్రి 8గం.లకు చేరుకుంటారు. రాత్రి 8. 30గం.లకు పాతర్లపాడు వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరిస్తారు.