Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరుకానున్న సీఎం కేసీఆర్
- ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బుధవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిóగా హాజరు కానున్నారు. సంబంధిత ఏర్పాట్లను దళిత అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే క్రిస్మస్ వేేడుకలను అధికారికంగా నిర్వహించుకుంటున్నామని గుర్తుచేశారు. బుధవారం నాటి వేడుకల్లో సుమారు 12 వేల మంది పాల్గొంటారని వెల్లడించారు. సాయంత్రం ఐదు గంటల సమయానికే అందరూ ఎల్బీ స్టేడియానికి చేరుకోవాలని సూచించారు. సాయంత్రం ఆరు గంటలకు సీఎం కేసీఆర్ స్టేడియానికి చేరుకుంటారని చెప్పారు. విందుతో పాటు కొంత మందికి అవార్డులు అందజేయనున్నామని తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, స్టీఫిన్ సన్, ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు, సురభివాణి, నగర మేయర్ విజయ లక్ష్మీ, డిప్యూటీ మేయర్, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మెన్ రాజీవ్ సాగర్, మైనారిటీ కార్పొరేషన్ ఎండి క్రాంతి వెస్లీ, శంకర్ లూక్, రాయడన్ రోస్, విద్య స్రవంతి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఉన్నారు.