Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేల అసంతృప్తిపై మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-కంటోన్మెంట్
బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద కుటుంబం లాంటిది. కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంత్రి వైఖరిపై అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రి తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తామంతా అన్నదమ్ముల్లా ఉంటామని.. ఇది తమ కుటుంబ సమస్య అని చెప్పారు. ఈ సమస్యను పార్టీ పెద్దలు కుటుంబ పెద్దలా చూసుకుంటారని చెప్పారు. తాను గాంధేయవాధినని ఎవరితోనూ విబేధాలు పెట్టుకోనన్నారు. అవసరమైతే తానే ఆ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్తానని, లేదంటే వారినే తన ఇంటికి లంచ్‌కు పిలుస్తానని తెలిపారు. ఈ విషయాన్ని మీడియా ఇంకా రాద్దాంతం చేయొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.