Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్లో ప్రొ. లింబాద్రి
నవతెలంగాణ- వరంగల్
గత, వర్తమాన తరాల నుంచి, భవిష్యత్ తరాలకు పుస్తకమే జ్ఞాన వంతెనని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మెన్ ప్రొ. లింబాద్రి అన్నారు జ్ఞాన తెలంగాణ నిర్మాణానికి పుస్తకాలే పనిముట్లని తెలిపారు. మంగళవారం సాయంత్రం కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఛాంబర్ లో రెండు తెలుగు రాష్ట్రాల వైస్ ఛాన్సలర్లు, ప్రొఫెసర్లుతో కలిసి 35 వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన పోస్టర్ ను ప్రొఫెసర్ లింబాద్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత కలలకు నవతరం ఆలోచనలకు పుస్తకాలే సోపానాలని అన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు, రాష్ట్రంలోని అన్ని కళాశాలల విద్యార్థులు హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్. వివిధ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, ఆనంద నాయుడు, సుబ్రహ్మణ్యం, గొనా నాయక్, నిత్యానందరావు, ఉషా కిరణ్, సుధాకర్, ఆడప సత్యనారాయణ, యాదగిరి రావు, బన్న ఐలయ్య, భరత్, రాజిరెడ్డి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.