Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్‌లో చెలరేగిన అసమ్మతి మంటలను చల్లబర్చించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. ఈమేరకు బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజరుసింగ్‌ను రాష్ట్రానికి పంపింది. బుధవారం రాత్రి ఆయ న హైదరబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్‌కుమార్ యాదవ్, మహేష్‌కు మార్‌గౌడ్, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ప్రోటోకాల్ ఇంచార్జి హర్కర వేణుగోపాల్, సంగిశెట్టి జగదీష్, రోహిన్‌రెడ్డి, సొహైల్, మెట్టుసాయి తదతరులు ఘనంగా స్వాగతం పలికారు. గురువారం గాంధీభవన్‌లో సీనియర్లతో ఆయన 'వన్ టూ వన్' మాట్లాడనున్నారు.
బీఆర్ఎస్తో తెలంగాణకు అన్యాయం : జి నిరంజన్
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జి నిరంజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్టీలు అని అనేక సార్లు నిందించాయనీ, ఏ మొఖం పెట్టుకుని సీఎం కేసీఆర్ ఏపీలో పార్టీని ప్రారంభిస్తారని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలకు అనేక అంశాల్లో విభేదాలు ఉన్నాయని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణను దోచుకుని ఇప్పుడు దేశమంతా దోచుకునేలా ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు.
టీడీపీ నుంచి వచ్చినా చిత్తశుద్ధితో పని చేస్తున్నాం
పటేల్ రమేష్‌రెడ్డి, వెంకటేష్, వజ్రేష్‌యాదవ్ వెల్లడి
టీడీపీ నుంచి కాంగ్రెస్‌కు వచ్చిన ఆరేండ్లలో పార్టీ కోసం చిత్తశుద్దితో పని చేస్తున్నామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు పటేల్ రమేష్‌రెడ్డి, చారగొండ వెంకటేష్, వజ్రేష్ యాదవ్ వెల్లడించారు. తమకు పార్టీలో సముచిత స్థానం కల్పించారని గుర్తు చేశారు. పార్టీలో పని చేస్తూ మరో పార్టీకి లాభం చేసే నాయకులం కాదని పేర్కొన్నారు. తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు రాయడం సరైందికాదన్నారు.
విద్యుత్ శాఖ ప్రతిపాదనలు ఆమోదించొద్దు : బక్క జడ్సన్
సామాన్య ప్రజలపై విద్యుత్ భారాలు మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని ఏఐసీసీ సభ్యులు బక్క జడ్సన్ విమర్శించారు. విద్యుత్ శాఖ ప్రతిపాదనలను తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించవద్దని ఒకప్రకటనలో కోరారు.