Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మిక్స్డ్ ఆక్యుపెన్సీ పేరుతో అనుబంధ గుర్తింపు రాని కళాశాలల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు అనుమతివ్వాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో మిక్స్డ్ ఆక్యుపెన్సీలో ఉన్న 465 ప్రయివేటు జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు ప్రస్తుత విద్యాసంవత్సరంలో గుర్తింపు ఇవ్వలేదని తెలిపారు. ఈ కళాశాలల్లో చదువుతున్న 80 వేల మంది విద్యార్థులు పరీక్ష ఫీజులు కట్టలేదని పేర్కొన్నారు. ఆలస్య రుసుం రూ.వెయ్యితో ఈనెల 22 వరకు, రూ.ఐదు వేలతో 28వ తేదీ వరకు ఫీజు కట్టేందుకు అవకాశముందని వివరించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ కళాశాలలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో తనిఖీలు చేసి నిబంధనల ప్రకారం నడిచే కళాశాలలకు అనుమతులివ్వాలని సూచిం చారు. కానీ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వహించి పరీక్షలు దగ్గరకు వస్తున్న సమయంలో ఫీజులు కట్టించుకో కుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని విమర్శించారు. 80 వేల మంది విద్యార్థు లు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చే శారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు
టాయిలెట్లను వెంటనే నిర్మించాలి
ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు సరిపడా టాయిలెట్లను వెంటనే నిర్మించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని సరూర్నగర్ ప్రభుత్వ కళాశాలలో 400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని బుధవారం మరో ప్రకటనలో తెలిపారు. ఈ కళాశాలలో కేవలం ఒకే ఒక్క టాయిలెట్ ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మలముత్రాలు రాకుండా వారు టాబ్లెట్లు వాడడమనేది ఆ కాలేజీ దుస్థితి అద్దం పడుతున్నదని పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులు అనారోగ్యం పాలయ్యే అవకాశముందని వివరించారు. వారు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉందని తెలిపారు. అందువల్ల ప్రభుత్వ విద్యాసంస్థల్లో సరిపడా టాయిలెట్లను నిర్మించి విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.